ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని పదవీకాలం మరో 20 రోజుల్లో పూర్తి అవుతుంది, తదుపరి ఏపీకి కొత్త సీఎస్ ఎవరు అనేదాని గురించి చర్చ జరుగుతోంది, ముఖ్యంగా చాలా మంది సీనియర్ అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ఆమె జూన్ 30న రిటైర్ కావాల్సి ఉంది. కానీ, జగన్ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఆమె పదవీకాలాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగించింది.
సీనియర్ ఐఏఎస్లలో కూడా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి, అయితే సీఎం జగన్ ఎవరిని ఫైనల్ చేస్తారు అనేది ఇటు అధికారులు ఆలోచిస్తున్నారు.ఏపీకి కొత్త సీఎస్ రేసులో ఆదిత్యనాథ్ దాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. . ప్రస్తుతం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ను సీఎస్ కార్యాలయంలో అదనపు బాధ్యతలు అందిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక ఆయన గురించి చూస్తే ఆయనది సొంత స్టేట్ బీహార్, 1987వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి. బెనారస్ హిందూ యూనివర్సిటీలో బీఎస్సీ హానర్స్ చేశారు, ఢిల్లీలోని జేఎన్యూలో ఇంటర్నేషనల్ స్టడీస్చేశారు. విజయనగరం, విజయవాడ అసిస్టెంట్ కలెక్టర్గా, కృష్ణా జిల్లా జేసీగా, వరంగల్ కలెక్టర్గా ప్రజలకు సేవ చేశారు. మరిఎవరు కొత్త సీఎస్ గా వస్తారో వేచి చూడాలి.