నూతన చీఫ్ డిఫెన్స్ ఆఫ్ స్టాఫ్ గా ఆర్మీ ఛీఫ్ ఎవరంటే ?

Who is the new Chief of Army Staff?

0
80

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రిదళాధిపతి (సీడీఎస్​) జనరల్ బిపిన్​ రావత్ మృతి చెందారు. ఇప్పుడు ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారన్న ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. తదుపరి సీడీఎస్​ను​ ఎంపిక చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్న నేపథ్యంలో అతి త్వరలోనే ఈ ప్రక్రియను మొదలుపెట్టనుంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే.. సైన్యాధిపతి జనరల్​ మనోజ్​ ముకుంద్​ నరవణెకు త్రిదళాధిపతి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.  త్రివిధ దళాలకు అధిపతులను ఎంపిక చేయడంలో ఏదైతే విధానాన్ని కేంద్రం అనుసరిస్తుందో సీడీఎస్​ ఎంపికలోనూ అదే తరహా విధానాన్ని పాటించనుంది.

చీఫ్స్​ ఆప్ స్టాఫ్ కమిటీ(సీఓఎస్​సీ)కి సీడీఎస్​ అధిపతిగా వ్యవహరిస్తారు. చైనాతో తూర్పు లద్దాఖ్​లో సరిహద్దు వివాదం సహా వివిధ అంశాలను జనరల్ నరవణె సమర్థంగా పరిష్కరించిన నేపథ్యంలో ప్రభుత్వం నరవణెకే సీడీఎస్ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు అధికంగా ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

ఆర్మీ చీఫ్​గా జనరల్​ బిపిన్​ రావత్​ నుంచి 2019, డిసెంబర్​ 31న బాధ్యతలు స్వీకరించారు నరవణె. 2022, ఏప్రిల్​ వరకు ఆయన పదవీకాలం ఉంది. ప్రస్తుతం నౌకాదళ అధినేత అడ్మిరల్​ ఆర్​ హరి కుమార్​ ఆ బాధ్యతలు నవంబర్​ 30నే స్వీకరించారు.