అసెంబ్లీకి పిలుస్తారా…నన్నే రమ్మంటారా.. video

0
90

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల టిఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల మాట్లాడుతూ..నా మీద ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు, మంత్రులు స్పీకర్ కు ఫిర్యాదు చేయడం, అందుకు స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించారు. ఇక నన్ను అరెస్ట్ చేస్తారట. కేసులు పెడతారట. నన్ను అసెంబ్లీకి రమ్మంటారట. వివరణ కోరతారట. ఎవరు నన్ను రమ్మనేది దమ్ముంటే నన్ను అసెంబ్లీకి రమ్మనండి. కాలినడకన తలెత్తుకుంటూ వస్తా. మీరు డేట్ ఇస్తారా నేనే డేట్ తీసుకొని రావాలా అని ప్రశ్నించారు. అసెంబ్లీలోకి రావాలా? అసెంబ్లీ ముందుకు రావాలా? చెప్పండి. ఇక్కడున్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. పులి బిడ్డ. భయపడేదాన్ని కాదు నేను. మీ అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలపై నేను మాట్లాడుతా అన్నారు.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://fb.watch/fE6pthmZj2/

తల్లికి, చెల్లికి తేడా తెలియని ఈ మంత్రి నిరంజన్ రెడ్డి, పరాయి స్త్రీలో ఒక తల్లిని, బిడ్డను చూడలేని మంత్రికి వీధి కుక్కకు తేడా ఏంటని మండిపడ్డారు. పరాయి స్త్రీని మరదలు అని పిలిస్తే మీరు ఏం చేస్తారు అని ప్రజలను అడిగారు. నా మీద మంత్రి నిరంజన్ రెడ్డి కేసు పెడితే FIR పెట్టారు. అదే నేను వెళ్లి కేసు పెడితే FIR కూడా తీసుకోరా అని మండిపడ్డారు. ప్రజల పక్షాన నిలబడి 2000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తుంటే నా మీద కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.