మ‌ద్యం దొర‌క్క అత‌ను చేసిన ప‌నికి షాకైన గ్రామ‌స్తులు

మ‌ద్యం దొర‌క్క అత‌ను చేసిన ప‌నికి షాకైన గ్రామ‌స్తులు

0
115

క‌రోనా వైర‌స్ వ్యాప్తితో మందుబాబుల‌కి మందు దొర‌క్క చాలా ఇబ్బంది ప‌డుతున్నారు.. క‌ల్లు కూడా దొర‌క్క గ్రామాల్లో కూడా చాలా మంది వింత‌గా మందుబాబులు ప్ర‌వ‌ర్తిస్తున్నారు, సామాన్యుల కంటే మందుబాబుల గోల ఎక్కువ అయింది అంటున్నారు పోలీసులు. ఇక నిత్యం మందు తాగే అల‌వాటు ఉన్న‌వారు మందు లేక వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

కొంతమంది ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలున్నాయి. మరికొందరు మద్యం దొరక్కపోవడంతో ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లి తిరిగి రావ‌డం లేదు.ఇలా చాలా మందిని ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తీసుకువస్తున్నారు.

తాజాగా ఓ వ్యక్తి మద్యం దొరక్క బావిలో దూకేశాడు. అత‌నిని బ‌య‌ట‌కు తీయ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డారు అక్క‌డ స్ధానికులు, అయితే ఈత వ‌చ్చినా అత‌ను పైకి రావ‌డానికి నిరాక‌రించాడు.. దీంతో ఫైర్ డిపార్ట్ మెంట్ వారు వ‌చ్చి తాడుల‌తో అతనిని బ‌య‌ట‌కు తీశారు, మద్యం తెచ్చారా అని అన‌డంతో వారు షాక్ అయ్యారు వెంట‌నే ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు.