బ్రేకింగ్ – మాస్క్ పెట్టుకోకపోతే 2000 జరిమానా కీలక ప్రకటన

బ్రేకింగ్ - మాస్క్ పెట్టుకోకపోతే 2000 జరిమానా కీలక ప్రకటన

0
32

ఈ కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది, అయితే కరోనా వేళ జాగ్రత్తగా ఉండమని చెబుతున్నా కొందరు ఈ జాగ్రత్తలు తీసుకోవడం లేదు.. దీని వల్ల వారు కరోనా బారిన పడటమే కాదు అవతల వారిని కూడా ఇరుకున పెడుతున్నారు, చాలా మంది ఇంకా గుంపులుగా తిరుగుతున్నారు.. మాస్క్ ధరించడం లేదు.. అంతేకాదు ఇష్టం వచ్చిన రీతిన మాస్క్ లేకుండా సోషల్ డిస్టెన్స్ లేకుండా ఉంటున్నారు.

ఇక సెకండ్ వేవ్ మొదలైంది అనే హెచ్చరిక ఉన్నా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి అలసత్వం చాలా మంది ప్రదర్తిస్తున్నారు, ఇప్పుడు కేరళ దిల్లీలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి, అక్కడ చాలా వరకూ కట్టడి చేస్తున్నారు అధికారులు.
ఢిల్లీలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. దీంతో, అక్కడి కేజ్రీవాల్ ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసింది.

ఎవరైనా రోడ్లుపైకి వచ్చిన సమయంలో మాస్కులు లేకుండా కనిపిస్తే వారికి ఇక ఫైన్ విధిస్తారు.మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే రూ. 2 వేల జరిమానా విధిస్తున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. నిన్నటి వరకూ ఈ ఫైన్ 500 ఇప్పుడు దీనిని 2000 పెంచారు. ఇక దిల్లీ వీదుల్లో చాలా ప్రాంతాల్లో సంఘాలు సామాజిక సంస్థలు మాస్కులు పంపిణీ చేస్తున్నాయి.