పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యామిని

పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యామిని

0
95

టీడీపీ తరపున తన వాయిస్ ను గట్టిగా వినిపించిన సాదినేని యామిని ఎన్నికల తర్వాత ఆ పార్టీకి గుడ్ చెప్పిన సంగతి తెలిసిందే…. తాజాగా ఆమె ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… టీడీపీ నాయకులు పై అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు…

తాను టీడీపీలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నానని అన్నారు… తనకు టీడీపీ అధిష్టానం పదవి ఇచ్చినప్పుడు పార్టీనేతలు ఈర్ష్యపడ్డారని దీంతో తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయించారని అన్నారు… ఈ విషయాన్ని తాను చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకువెళ్లానని చెప్పారు…

గ్లామర్ తోనే రాజకీయాల్లో ఎదుగుతారనే విషయంపై తనకు అంత క్లారిటీ లేదని అన్నారు…. తాను ఎమ్మెల్యే టికెట్ కోసం చంద్రబాబు నాయుడు ఇంటిముందు ధర్నాలు చేయించాననేది వాస్తవం కాదని అన్నారు… మల్లెపువ్వు ఒక పవిత్రమైన పువ్వు పవన్ పై వ్యాఖ్యలు తర్వాత అలా పేరు రావడం పై చాలా బాధ కలిగించిందని అన్నారు.. కొద్దిరోజులు కూర్చుని ఆలోచించానని అన్నారు…