యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజవకర్గ వైసీపీ నేత .. అయితే ఆయన ఓటమి తర్వాత పార్టీ పరంగా చూసుకుంటే జగన్ ఆయనకు ఎంతో విలువ ఇచ్చారు.. ఆయన పార్టీ మారి వేరే పార్టీలోకి వెళ్లరు అని అందరికి తెలుసు. అయితే తెలుగుదేశం మాత్రం అప్పుడే పావులు కదుపుతోందట గన్నవరంలో.. వల్లభనేని వంశీ పార్టీని వీడటంతో అక్కడ వంశీకి వైసీపీ టికెట్ ఇస్తే యార్లగడ్డకు అన్యాయం జరుగుతుంది కాబట్టి.. దానిని అనుకూలంగా మార్చుకోవాలి అని చూస్తోంది టీడీపీ.
ఒకవేళ వైసీపీ వంశీకి టికెట్ ఇస్తే, యార్లగడ్డ వెంకట్రావుని తమ పార్టీలో చేర్చుకోవాలి అని ఆయనకు టికెట్ ఇవ్వాలి అని భావిస్తోందట. జిల్లా నేతలు ఇప్పటికే ఆలోచనలు చేస్తున్నారట. అయితే ఇక్కడ టీడీపీకి మరో షాకింగ్ న్యూస్ ఏమిటి అంటే, యార్లగడ్డ వెంకట్రావు జగన్ కు అత్యంత సన్నిహితుడు.. ఇప్పుడు జగన్ వంశీకి టికెట్ ఇచ్చి ఆయనకు టికెట్ ఇవ్వకపోయినా పార్టీలో పనిచేస్తారు.. కాని టీడీపీకి వెళ్లరు అంటున్నారు అక్కడ వైసీపీ కేడర్ … మరి తెలుగుదేశం ఎన్ని కుట్రలు పన్నినా గన్నవరం టీడీపీకి వరం కాదు అంటున్నారు.