చంద్రబాబుకు అసైల సినిమా చూపించిన వైపీసీ

చంద్రబాబుకు అసైల సినిమా చూపించిన వైపీసీ

0
87

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాసనమండలి రద్దు తీర్మాణాన్ని ప్రవేశ పెట్టారు ఈ ఒక్కరోజు శాసనమండలి రద్దు పై సభలో చర్చించాలని బీఏసీ తీర్మాణం తీసుకుంది… గతంలో అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనమండలి పై చేసిన వ్యాఖ్యలు మీడియో ద్వారా ప్రదర్శన వేసి చూపించారు…

ఈ వీడియో చంద్రబాబు నాయుడు శాసనమండలిని రద్దు చేయాలని వ్యాఖ్యానించారని తెలిపారు ధర్మాన… జగన్ పేద పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారని అయితే వారికి మేలు జరుగకూడదనే ఉద్దేశంతో టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు…

చారిత్రాత్మక బిల్లును అడ్డుకుని టీడీపీ నేతలు శునకానందం పొందుతున్నారని ఆయన ఆరోపించారు… చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు చేతబడులకోసమే అని ఆరోపించారు… తన కోసం తన సొంత ప్రయోజనాలకోసం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ధర్మాన ఆరోపించారు… రాజధాని తరలించేది లేదని దానితో పాటు మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పామని అన్నారు…