తెలుగుదేశం పార్టీని చెడుగుడు ఆడుకున్న వైసీపీ

తెలుగుదేశం పార్టీని చెడుగుడు ఆడుకున్న వైసీపీ

0
100

ఏపీ సర్కార్ ప్రవేశ పెట్టబోతున్న ఇంగ్లీష్ మీడియంపై నేడు అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది…. ఇంగ్లీష్ మీడియంపై చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ… అద్యక్షా తాను గతంలో యంఏ తర్వాత పీహెచ్ డీ రీసెట్ రాయాలని అనుకున్నాను అధ్యక్షా…

రీసెట్ లో క్వాలిఫై అయ్యాను క్వాలీఫై అయిన తర్వాత మూడు సంవత్సరాల్లో పీహెచ్ డీ పూర్తి చెయ్యాలి అంటే పీహెచ్ డీ ఒక సంవత్సరాని ముందు ప్రీ పీహెచ్ డీ పరీక్ష రాయాలి అధ్యక్షా ఈ పరీక్షలో 100 మార్కులు ఉంటాయి… అందులో 5 ప్రశ్నలకు జవాబు రాయాలి ఈ పరీక్షను తాను తెలుగులో రాద్దామని అనుకున్నాను అధ్యక్షా…

అయితే తాను తెలుగు రాయడానికి వీళ్లేదన ఇదే తెలుగుదేశం పార్టీకి చెందిన విద్యర్థి విభాగం తనను డిస్క్వాలీఫై చేయండని ఆరో ధర్నాలు చేసిందని అన్నారు… ఆ రోజు ఏమో తాను తెలుగులో రాయడానికి వీళ్లేదు ఇంగ్లీష్ లో రాయాలని ధర్నాలు చేశారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెడుతుంటే వ్యతిరేకిస్తున్నారని ఆయన మండిపడ్డారు…