వైసీపీ ఎఫెక్ట్… రాజధానిలో భూములు ఉన్నాయని ఒప్పుకున్న టీడీపీ నేత

వైసీపీ ఎఫెక్ట్... రాజధానిలో భూములు ఉన్నాయని ఒప్పుకున్న టీడీపీ నేత

0
83

టీడీపీ అధికారంలో చంద్రబాబు నాయుడు సన్నిహితులు బంధువులు పెద్దఎత్తును భూములను కొన్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు… వారిపేర్లను కూడా చదవి వినిపించారు… బుగ్గన అనౌన్స్ చేసిన వారిలో మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు అలాగే గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు వినికొండ మాజీ ఎమ్మెల్యే సీవీ ఆంజనేయులుకూడా రాజధానిలో భూములు ఉన్నాయని బుగ్గన ఆరోపించిన సంగతి తెలిసిందే…

ఇక ఈ ఆరోపణలపై ఆంజనేయులు స్పందించారు… తనకు రాజధానిలో భూములు ఉన్నాయన్న మాట వాస్తమేనని అన్నారు అయితే రాజధానిపై కేబినెట్ తిర్మానం తర్వాత భూములను కొన్నానని తెలిపారు… రాజధానిని అభివృద్ది చేసే ఆలోచనలో ఉంటే తాను తన భూమిని ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు…

ఇటీవలే రావెల కిశోర్ బాబు కూడా స్పందించారు.. లోకేశ్ సన్నిహితుడు వేమూరి రవికుమార్ కూడా తనకు కేవలం 16 ఎకరాలు భూమి మాత్రమే ఉందని అన్నారు…