చంద్రబాబుపై వైసీపీ ఫైర్

చంద్రబాబుపై వైసీపీ ఫైర్

0
228

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన చూసి టీడీపీ నేతలు ఓర్వలేక ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు… తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడతూ…

చంద్రబాబు నాయుడు వయసుతో పాటు మెదడు ఎంత కుళ్లిపోయిందో అర్థం కావడంలేదా అని ప్రశ్నించారు.. జగన్ కు జనంలో పేరుగుతున్న ఆధరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు…

చెదురు మదురు ఘటనలను దళితులపై దాడులు గానూ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే హిందూ వ్యతిరేక చర్యలుగా ప్రచారం చేసి లబ్దిపొందుతున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు… అయితే చంద్రబాబు నాయుడు ఎత్తుగడలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు…