ఆ టీడీపీ ఎంపీని ఫాలో అవుతున్న వైసీపీ ఎందుకో తెలిస్తే షాక్

ఆ టీడీపీ ఎంపీని ఫాలో అవుతున్న వైసీపీ ఎందుకో తెలిస్తే షాక్

0
96

ముక్కు సూటిగా, నిజాయితీగా ఉండే టీడీపీకి చెందిన ఓ ఎంపీ కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనిత్యం ఫాలో అవుతోందా…. ఆయన ఇప్పటికీ వైసీపీ వైపు కన్నెత్తికూడా చుడకున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు…

ఆ ఎంపీ ఎవరోకాదు విజయవాడకు చెందిన కేసినేని నాని… ఈయన్ను వైసీపీలో చేర్చుకునేందుకు ఆపార్టీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నాని సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఎటువంటి పోస్టులు పెట్టినా కూడా దాన్ని వైసీపీ చెందిన సోషల్ మీడియాలు వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు.

త్వరలో నాని జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం తీసుకోబోతున్నారని వైరల్ చేస్తురు. ఇప్పటికే ఈ ప్రచారాలకు నాని పుల్ స్టాప్ పెట్టురు. ఇక ఇదే క్రమంలో వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో నానికి సంబంధించి మరో వార్తను హల్ చల్ చేస్తున్నారు.

నాని టీచర్స్ డే సందర్భంగా అమ్మ ఒడిపథకం సక్రమంగా అమలు చేస్తే బలహీన వర్గాల పిల్లలు విద్యావంతులు అవుతారని అన్నారు. ఈ మాటను వైసీపీ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. త్వరలో నాని వైసీపీలో వస్తున్నారని ప్రచారం చేస్తున్నారు.