వైసీపీకి గుడ్ బై చంద్రబాబు రెడ్ సిగ్నల్

వైసీపీకి గుడ్ బై చంద్రబాబు రెడ్ సిగ్నల్

0
94

ఎన్నికలు అంటేనే పార్టీలో నేతలు జంపింగ్ లు ఉంటాయి… ముఖ్యంగా ఆపార్టీ తరపున సీటు సాధించి తర్వాత పార్టీ మారిన పరిస్దితి ఈసారి కనిపించింది అని చెప్పాలి.. వీరు అందరూ ఇప్పుడు తెగ టెన్షన్ పడుతున్నారు.. ముఖ్యంగా జగన్ వద్ద ఉంటే గెలుపు ఖాయం అని భావించారు.. కాని వాస్తవంగా చూస్తే ఏపీలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని సర్వేలు చెబుతున్నాయి.. ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే చెబుతున్నాయి.. అలాగే బాబు కూడా నాలుగు సర్వేలు చేయించారు అవి కూడా అదే చెబుతున్నాయి.

ఇక పీకే మాత్రం సర్వే చేయలేదు .ఇక జగన్ మాత్రం తాము గెలుస్తాం అని కేవలం ఎన్నికల రోజు మాత్రమే చెప్పారు. అయితే ఇప్పుడు దీని గురించి చర్చ జరుగుతోంది.. ఎలాంటి ఫలితాలు వస్తాయని నేతల్లో ప్రజల్లో ఆలోచన పెరిగిపోయింది అని చెప్పాలి… ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరి పార్టీ తరపున టికెట్ పొందిన నేతలు తమకు గెలుపు రాదు అని తెలియడంతో, తెలుగుదేశం పార్టీలోకి రావాలి అని తమ సన్నిహితులతో రాయబారాలు స్టార్ట్ చేశారట.

అయితే చంద్రబాబు మాత్రం ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయను అని చెప్పారట.. పొలిటికల్ గా ఒకచోట నిలబడని వారిని తాము చేర్చుకోము అని చెబుతున్నారు.. ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం జిల్లా నేతల విషయంలో చంద్రబాబు చాలా కఠినంగా ఈ విషయంలో ఉన్నారు అని చెబుతున్నారు నేతలు.. అయితే చంద్రబాబు నిర్ణయం పై సొంత పార్టీ నేతలు కూడా అదే చెబుతున్నారు.