YCP vs TDP | త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన వైసీపీ కీలక నేతలు

-

YCP vs TDP | ఎన్నికల వేళ వైసీపీ నేతలు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఐదేళ్లుగా తనపై చూపిన ప్రేమ, అభిమానం మరవలేనని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా అభివృద్ధి కోసం మళ్లీ పోటీ చేయబోతున్నానని తెలిపారు. త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నానని.. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకొస్తున్నానని స్పష్టం చేశారు. మరోసారి తనకు అవకాశం ఇస్తే పల్నాడు జిల్లా అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తా అని లేఖలో వెల్లడించారు.

- Advertisement -

YCP vs TDP | మరోవైపు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్టప్రసాద్ కూడా రెండు రోజుల్లో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలందరితో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతానని తెలిపారు. అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవని.. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కలిసి అన్నీ మాట్లాడుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషించాలని జగన్ చెప్పారని.. అలా అయితేనే టికెట్ ఇస్తామని చెప్పారన్నారు. వైసీపీలో ప్రతిపక్షాలను దూషిస్తేనే మంత్రి పదవులు ఇస్తారంటూ మండిపడ్డారు. కాగా వీరితో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా త్వరలోనే పసుపు కండువా కప్పుకోనున్నారు.

Read Also: వైవీ సుబ్బారెడ్డిని బూతులు తిడుతూ.. మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...