Home రాజకీయం వైసీపీకి ‘గంట’ కొట్టారు

వైసీపీకి ‘గంట’ కొట్టారు

వైసీపీకి ‘గంట’ కొట్టారు

0
169

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీ వికేంద్రీకరణ దిశంగా మూడు రాజధానులు రావచ్చని చెప్పారు… దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు… జగన్ పాలన తుగ్లక్ పాలనగా ఉందని అన్నారు… జగన్ అమరావతిని ముంచేయాలని చూస్తున్నాని తన డ్రీమ్ ప్రాజెక్ట్ అమరావతి అని అన్నారు… అయితే ఆయన ఎమ్మెల్యే మాత్రం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు…. గంటా శ్రీనివాసరావు మూడు రాజధానులపై స్పందించారు…

విశాఖపట్నంని పరిపాలనా రాజధాని గా మార్చే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి శాసనసభ లో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని అన్నారు. సహజ సిద్ధమైన సముద్ర తీర నగరం విశాఖ ను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయం అని అన్నారు .రోడ్, రైల్, ఎయిర్, వాటర్ కనెక్టివిటీ తో రాజధాని గా అందరి ఆశలు, ఆంక్షలని నెరవేర్చే నగరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

కాస్మో మెట్రో నగరం పరిపాలనా కేంద్రం గా కూడా మారితే విశ్వనగరంగా ప్రసిద్ధి చెందడం ఖాయం అని తెలిపారు. అందుకు విశాఖ ప్రజలు తమ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు.