మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వ్యక్తులు అధికంగా ఉన్న ప్రాంతీయపార్టీల్లో వైసీపీ దేశంలోనే No.1అని ADR అనేసంస్థ రిపోర్ట్ ఇచ్చిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. అలాంటి పార్టీ దిశచట్టం తెస్తే అమలు సాధ్యమేనా అని దేశమంతా చర్చజరుగుతుందని ఎంపీ విజయసాయి రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.. దిశచట్టం తెచ్చిన తరువాత ఏపీలో 5అత్యాచారఘటనలు జరిగాయని బుద్దా ట్వీట్ చేశారు.. అలాగే మరికొన్ని ట్వీట్లుకూడా చేశారు పాఠకుల కోసం బుద్దా వెంకన్న చేసిన ట్వీట్లు యధావిధిగా
21 రోజుల్లో వారికి శిక్షవేసి అప్పుడు మీరు జగన్ గారికి డప్పు కొట్టండి. 7నెలల పాలనలో మహిళలపై 4700వేధింపుల ఘటనలు జరిగినట్టు మీ స్పందించని స్పందనకార్యక్రమానికి ఫిర్యాదులు వచ్చినట్టు ప్రభుత్వమే ప్రకటించింది. అంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళలకు రక్షణ ఏరేంజ్ లో ఉందో అర్థంఅవుతుంది
ఇటీవల కాలంలో ఒక టీవీ చర్చా కార్యక్రమంలో మహిళా యాంకర్ పోలీసు అధికారి ముందే 100కి డయల్ చేసినా స్పందన లేకపోయేసరికి పోలీసు అధికారికి సెక్యూరిటీగా వచ్చిన కానిస్టేబుల్స్ ని వెనక్కి పంపి వారినే తిరిగి టీవీ స్టూడియోకి రమ్మని చెప్పిన ఘటన ప్రజలకు తెలియదని అనుకుంటున్నారా?
దిశ చట్టంతో మహిళలకి రక్షణ కల్పించిన జగన్ అని డప్పు కొట్టడం మాని ముందు 100 కి ఫోన్ కొడితే పోలీసులు వచ్చే మార్గం చూడండి