జగన్ తో 48 మంది సీక్రెట్ భేటీ వాట్ నెక్ట్స్

జగన్ తో 48 మంది సీక్రెట్ భేటీ వాట్ నెక్ట్స్

0
95

ఏపీలో వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి రాబోతున్నారు అని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి అధికారం రాదు అని తెలుస్తోంది ఈ ప్రచారంలో… ముఖ్యంగా సర్వేలు ఇలా ఉంటే, మే 19న వచ్చే ఎగ్జిట్ పోల్స్ కూడా ఎలా ఉండబోతున్నాయి, అవి కూడా వైసీపీకి అధికారం అని చెబితే కచ్చితంగా జగన్ కు అధికారం రావడం పక్కా అని చెప్పాలి.. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు మొత్తం దేశం అంతా తిరుగుతున్నారు.. ఆయనని దేశంలో సీనియర్లు అందరూ ప్రధాని మీరే అనేలా చెబుతున్నారని ఎల్లో మీడియా వార్తలు వదులుతోంది. కాని ఇక్కడ ఆయన పార్టీ గెలుస్తుందా లేదా అనే డౌట్ ఉంది.. ముఖ్యంగా ఆయన మాత్రం రాహుల్ ని ప్రధానిని చేయాలి అని చాలా కష్టపడుతున్నారు.. తాజాగా తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ పై ఓ వింత అభాండం స్టార్ట్ చేశారు.. అంతేకాదు జగన్ సీక్రెట్ మంతనాలు లీక్ చేస్తున్నారట. ఇంతకీ వారు చెబుతుంది ఏమిటి అంటే.

జగన్ తో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి చెందిన మొత్తం 48మంది ఐఏఎస్ అధికారులు రహస్యంగా భేటీ అయ్యారని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రచారంలో పెట్టారు. కొన్ని మీడియా సంస్థలు సైతం ఇదే అంశాన్ని పేర్కొన్నాయి. అయితే, ఈ విషయాన్ని రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం తోసిపుచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇప్పటికీ హైదరాబాద్లోనే ఉంటున్నారని, దీనిని సాకుగా చేసుకొని అధికారులు వైసీపీ అధ్యక్షుడు జగన్తో భేటీ అయ్యారని అసత్యప్రచారాన్ని చేపట్టడాన్ని సంఘం ప్రతినిధి కొట్టిపారేశారు. మొత్తానికి వైసీపీ అధినేతతో ఎవరూ భేటీ అవ్వలేదు అ ని, కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు అని అంటున్నారు.. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం నేతలు గెలవం అనే భావనతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు.. రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మాత్రమే జగన్ తో భేటీ అవుతున్నారు, ఆయనతో పలు విషయాలు షేర్ చేసుకుంటున్నారు.. దానికి ఇప్పుడు సర్వీసులో ఉన్న వారిని సాకుగా చూపించడం మంచిది కాదు అని హితవు పలుకుతున్నారు అధికారులు.