తెలుగుదేశం పార్టీకి వైసీపీ ప్రచారాలు చేయక్కర్లేకుండానే ఓట్లు గంపగుత్తగా వేసేలా సాయం చేస్తోంది అంటున్నారు కొందరు.. ఎందుకు అంటే పార్టీ తరపున యువతరం కాస్త హద్దు మీరుతోంది అంటున్నారు ప్రజలు.. పార్టీ గెలవకుండానే ఇలా మాట్లాడుతుంటే గెలిస్తే ఎలాంటి అరాచక రాజ్యం వస్తుందా అని భయపడుతున్నారు… తాజాగా వైసీపీ నాయకులు చేస్తున్న ప్రసంగాల్లో పసలేక జనాలకు కొత్తగా హీరోయిజం చూపిద్దామని ట్రై చేస్తున్నారు… చివరకు ఇది జగన్ కే మైనస్ అవుతోంది. ఇక ఇటీవల ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రం అంతా చూశారు.
జగన్ ఒక్క కనుసైగ చేస్తే చాలు, ఎవ్వరూ మిగలరంటూ యువకులను రెచ్చగొట్టారు. చంపడమో, చావడమో.. విజయమో, వీర స్వర్గమో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలా ఓ ఎమ్మెల్యే చేయడం పై విమర్శలు వచ్చాయి గెలిస్తేనే రాజకీయమా అని అంటున్నారు… అంటే గెలవకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల అంతు చూస్తాను అంటున్నారు అంటే ఏమి చేస్తారు? అని టీడీపీ నేతలు అడుగుతున్నారు …ఇక బాబు కూడా దీనిపై కౌంటర్ వేశారు అనిల్ కు …ఇలాంటి వేషాలు వేస్తే జైలులో పెడతాం అని తేల్చి ప్రచారంలో చెప్పారు.
ఇక మరో నాయకుడు అనంతపురం జిల్లాలో యువనేత తన జోరు ప్రచారంలో పెంచారు… ఆయనే అనంతపురం జిల్లా ఉరవకొండ వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి తనయుడు ప్రణయ్ రెడ్డి… ఇటీవల రాజకీయంగా యాక్టీవ్ అయిన ఈ యువనాయకుడు కూడా టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు..
20 ఏళ్ల నుంచి ఒక లెక్క. ఇప్పటి నుంచి ఒక లెక్క. విశ్వేశ్వరరెడ్డి కొడుకు వచ్చాడని చెప్పండి. తమాషాలు చేస్తే టీడీపీలో ఒక్కరిని కూడా వదలను. ప్రత్యర్థి పార్టీల అంతు చూస్తానంటూ హెచ్చరిస్తున్నారు. నా గురించి ఎవరో మాట్లాడాడు నేను తలచుకుని ఉంటే నువ్వు ఇప్పుడు ఉండేవాడివికాదు అంటూ విమర్శలుచేశారు… మొత్తం ఇప్పుడు ఈఇద్దరు నాయకులతో పాటు రఘురామకృష్ణం రాజు నరసాపురంలో తూగుతూ ఇచ్చిన స్పీచ్ కూడా పార్టీకి మైనస్ అవుతోంది… జగన్ కు ఇవన్నీ కచ్చితంగా ఎన్నికల్లో ప్రతికూలం అవుతాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.