బాబుకు షాక్ వైసీపీలోకి మాజీ ఎంపీ ఎంట్రీ

బాబుకు షాక్ వైసీపీలోకి మాజీ ఎంపీ ఎంట్రీ

0
78

ఎన్నికల సమయంలో ఓటర్లకు మాత్రం నాయకులు కన్ఫూజన్ తీసుకువస్తున్నారు.. నిన్నటి వరకూ ఓ పార్టీలో ఉన్ననేతలు ఇప్పుడు ఆ పార్టీ కండువా మార్చి వెంటనే పక్క పార్టీలో చేరిపోతున్నారు.. తాజాగా ఇలానే టీడీపీ నుంచి వైసీపీలో చేరారు మరో కీలక నేత.
ఎన్నికలు మరో వారం రోజుల్లో ఉన్నాయనగా కూడా టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు ఆగటంలేదు అని చెప్పాలి ఆయన చేరికతో మరింత జోష్ వచ్చింది పార్టీకి , ఈ మాజీ ఎంపీ వైసీపీ ఎంట్రీ టీడీపీకి షాక్ ఇచ్చింది.

అమలాపురం మాజీ ఎంపీ జీవీ. హర్షకుమార్ వైసీపీలో చేరారు.. జగన్ సమక్షంలో ఆయన కుమారుడు, మరియు స్ధానిక నేతలు వైసీపీలో చేరారు, హర్షకుమార్ టీమ్ కు జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అయితే కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరారు.. మార్చి 17న ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు.. కాకినాడలో జరిగిన ఓ సభలో చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు.. ఇప్పడు తెలుగుదేశం పార్టీలో తనకు సరైన న్యాయం జరగడం లేదు అని వైసీపీలో చేరారు. అయితే అమలాపురం ఎంపీ టికెట్ ఆయనకు వస్తుంది అని అందరూ భావించారు.. కాని అది బాలయోగి కుమారుడు హరీష్ కు వెళ్లింది. దీనితో ఇక ఆపార్టీ లో ఉండి, హరీష్ కు ప్రచారం చేయలేక పార్టీకి గుడ్ బై చెప్పి 15 రోజుల్లో బయటకు వచ్చారు అని తెలుస్తోంది.