వైసీపీలో చేరికపై పరిటాల ఫ్యామిలీ క్లారిటీ…

వైసీపీలో చేరికపై పరిటాల ఫ్యామిలీ క్లారిటీ...

0
48

స్థానిక సంస్థ ఎన్నికల నేపధ్యంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే… తమ రాజకీయాల దృష్ట్య చాలా మంది నేతలు వైసీపీలోకి జంప్ చేశారు… ఇక ఇదే క్రమంలో పరిటాల ఫ్యామిలీ కూడా వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్దమైందని వార్తలు వస్తున్నాయి..

పార్టీలో నెలకొన్న విభేదాల వల్ల పరిటాల ఫ్యామిలీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం తీసుకునేందుకు సిద్దమైందని వార్తలు వస్తున్నాయి… ఈ వార్తలపై పరిటాల శ్రీరామ్ స్పందించారు… తాము పార్టీలో చేరుతున్నామంటు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు…

కన్న తల్లిలాంటి పార్టీని విడిచి తాము ఎక్కడకు వెళ్లమని స్పష్టం చేశారు.. పార్టీమారే దురాలోచన తమకు లేదని స్పష్టం చేశారు… తరాలు మారినా సరే పసుపు జెండాకోసం పని చేస్తామని అన్నారు శ్రీరామ్… తమ కార్యకర్తలకు అండగా ఉంటామని పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు..