వైసీపీలో చేరికపై రాయలసీమ టీడీపీ టైగర్ క్లారిటీ…

వైసీపీలో చేరికపై రాయలసీమ టీడీపీ టైగర్ క్లారిటీ...

0
107

స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు తాజాగా ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి చేరిపోయారు… రానున్న రోజుల్లో ఈ వలసలు మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు…

ఇదే క్రమంలో త్వరలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే… ఈ వార్తలపై జనార్ధన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు… తాను వైసీపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు కార్యకర్తలు అధైర్యపడవద్దని అన్నారు జనార్థన్ రెడ్డి…

తాను వైసీపీలో చేరబోతున్నానంటు ప్రాచారం చేసి పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారని అలాంటి పప్పులు ఉడకవని అన్నారు…కాగా జనార్థన్ రెడ్డి 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున బనగానపల్లె నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు… అలాగే 2019లో కూడా మరో సారి అదే సెగ్మెంట్ నుంచి పోటీ చేసి 13 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు..