వైసీపీలో చేరిన అవినాష్ కు జగన్ ఆఫర్ అదిరింది..

వైసీపీలో చేరిన అవినాష్ కు జగన్ ఆఫర్ అదిరింది..

0
100

ప్రధాన ప్రతిక్ష తెలుగు దేశం పార్టీ నుంచి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి… ఇటీవలే కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ వైసీపీలో చేరారు… ఆయన తర్వాత మరికొద్దిరోజుల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరనున్నానని ప్రకటించారు.

ఈ క్రమంలో వైసీపీ తీర్థం తీసుకున్న అవినాష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులు అయ్యానని అందుకే ఆయన సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నానని స్పష్టం చేశారు…

అంతేకాదు తనకు విజయవాడ తూర్పు నియోజకవర్గం బాధ్యతలను అప్పగించినందుకు జగన్ కు కృతజ్ఞలు తెలుపుతున్నానని తెలిపారు… నియోజకవర్గంలో ప్రజలకు కలుపుకుని ముందుకు వెళ్తానని తెలిపారు అవినాష్….