వైసీపీలోకి వంశీ ఫ్రెండ్

వైసీపీలోకి వంశీ ఫ్రెండ్

0
94

టీడీపీకి కంచుకోట వంటి కృష్ణా జిల్లాలో ఆ పార్టీ బలహీన పడుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా వల్లభనేని వంశీ దేవినేని అవినాష్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే మరికొంత మంది ఆ దారిలో ఉన్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి, అవును వారి దారిలో మరి కొందరు టీడీపీకీ రాజీనామా చేయాలి అని చూస్తున్నారట.

వల్లభనేని వంశీకి క్లోజ్ ఫ్రెండ్ అయిన పెనమలూరు మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ బోడే ప్రసాద్ పక్క చూపులు చూస్తున్నారని అంటున్నారు. ఆయన కూడా టీడీపీలో అసంత్రుప్తిగా కొనసాగుతున్నారట, అందుకే ఆయన కూడా పార్టీ మారాలి అని భావించారనే వార్త వినిపిస్తోంది. అంతేకాదు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారాలి అని చూస్తున్నారు, వారిలో ఒకరు వైసీపీలో ఒకరు బీజేపీ వైపు వెళ్లాలి అని చూస్తున్నారట, అయితే మాజీ ఎమ్మెల్యేలు కాబట్టి జగన్ సమక్షంలో కండువాలు కప్పి వీరు ఏ క్షణమైనా పార్టీ మారే అవకాశం ఉంది అంటున్నారు నేతలు. మరి బోడె ప్రసాద్ పార్టీ మార్పు పై వస్తున్న వార్తలను ఆయన అభిమానులు మాత్రం ఖండిస్తున్నారు