ఇప్పుడు ఏపీలో ఒకటే చర్చ శ్రీకాళహస్తిలో కేసులు పెరుగుతున్నాయి… దీంతో అక్కడ ఎమ్మెల్యే చేసిన ర్యాలీతోనే అక్కడ కేసులు పెరిగాయి అని ఓ పక్క ప్రతిపక్షం విమర్శలు చేస్తోంది, కాని ఆరోజు పేదలకు సాయం చేసిన సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ పాల్గొనలేదు అని అక్కడ ఎమ్మెల్యే చెబుతున్నారు.
ఆరోజు ప్రభుత్వానికి అండగా నిలిచిన దాతలంటూ ఫ్లెక్సీలు వేయించి, ట్రాక్టర్ల ర్యాలీ తీస్తూ పేదలకు సరుకులు పంచారు ఎమ్మెల్యే మధుసుదన్ రెడ్డి… మొత్తం 49 కేసులు అక్కడ రావడంతో ఆయన కారణంతోనే కేసులు అంటూ రాద్దాంతం చేస్తున్నారు,ఇక ఇందులో 15 మంది సర్కారు ఉద్యోగులకు వైరస్ సోకింది అని అంటున్నారు.
మొత్తానికి కావాలనే ప్రతిపక్షం ఆ ఎమ్మెల్యేని టార్గెట్ చేసిందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు, ఆయన మాత్రం తాను ర్యాలీ చేపట్టలేదని నా చుట్టు కేవలం ఐదుగురు ఆరుగురు మినహ సర్కారు ఉద్యోగులు ఎవరూ లేరు అని చెబుతున్నారు, తప్పు నాది ఉంటే చట్టం ప్రకారం శిక్షకు రెడీ అంటున్నారు ఎమ్మెల్యే, అయితే దీనిపై కావాలనే ప్రతిపక్షం ఆయనని సెంటర్ చేస్తోంది అని విమర్శలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో.