అదే ఫైన‌ల్ ఇక డేట్ మార్చ‌నంటున్న సీఎం జ‌గ‌న్

అదే ఫైన‌ల్ ఇక డేట్ మార్చ‌నంటున్న సీఎం జ‌గ‌న్

0
60

దేశంలో ఈ వైర‌స్ మ‌హ‌మ్మారి చాప‌కింద నీరులా పాకుతోంది .. ఈ స‌మ‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాయి ప్ర‌భుత్వాలు.. అయితే సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏపీలో మ‌ళ్లీ పేద ప్ర‌జ‌ల‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పారు, ఇప్ప‌టికే ఉగాదికి పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలు అంద‌చేస్తాము అన్నారు.. 25 ల‌క్ష‌ల మంది పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చేందుకు సిద్దం అయ్యారు.

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కోడ్ ఉండ‌టం, అలాగే క‌రోనా ప్ర‌భావంతో ఇక ఏపీలో పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల కార్య‌క్ర‌మం ఉగాదికి జ‌రుగ‌లేదు, ఇప్ప‌టికే మ్యాపింగ్ కొల‌త‌లు అన్నీ పూర్తి చేశారు అధికారులు, ఈ స‌మ‌యంలో అధికారులు ఈ కోవిడ్ అరిక‌ట్టే కార్య‌క్ర‌మాల్లో బిజీ అయ్యారు.

ఈ స మ‌యంలో పేద‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జ‌గ‌న్ …జులై 8న వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా 27 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇస్తామని సీఎం జగన్‌ వెల్లడించారు. మహిళల పేర్లపై ఇళ్ల పట్టాలు జారీ చేస్తామని..అవి అందుకున్న వారందరికీ ఉచితంగా ఇళ్లు కూడా కట్టిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అయితే మ‌రో రెండు నెల‌ల స‌మ‌యం ఉంది, ఈ లోపు ఏదైనా డేట్ ప్ర‌క‌టించినా ఎన్నిక‌లు రావచ్చు, అలాగే లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియ‌దు, అందుకే తండ్రి పుట్టిన రోజున ఈ కార్య‌క్ర‌మాం చేప‌ట్టాలి అని సీఎం జ‌గ‌న్ భావించి ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.