వైసీపీలోకి నో ఎంట్రీ అంటున్న జగన్ ఫ్రెండ్

వైసీపీలోకి నో ఎంట్రీ అంటున్న జగన్ ఫ్రెండ్

0
83

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో చాలామంది నేతలు ఆ పార్టీని వీడటానికి సిద్దమయ్యారు…. ఇప్పటికే కొంతమంది బీజేపీ, వైసీపీలో చేరిపోయి యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు…. ఇదే క్రమంలో జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి వైసీపీలో చేరుతారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి….

గతంలో కూడా జేసీ ఫ్యామిలీ వైసీపీలో చేరనుందని వార్తలు వచ్చాయి కానీ తాము టీడీపీ వదిలేది లేదని స్పష్టం చేశారు… అయితే పవన్ జగన్ సన్నిహితుడు కనుకు ఆయన వైసీనీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి.. ఈ వార్తలపై ఆయన స్పందించారు…

తాను వైసీపీలో చేరుతానంటు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు…. తన ప్రాణం ఉన్నంతవరకు టీడీపీలోనే ఉంటానని అన్నారు…. కేసులు పెట్టాలంటే ముందుగా తనపై తన బాబాయ్ పై పెట్టాలని కార్యకర్తలపై కేసులు పెడితే సహించమని అన్నారు… వైసీపీ పాలన ఈ పార్టీ నాయకులకే నచ్చడంలేదని అన్నారు… రాష్ట్రంలో జమిలీ ఎన్నికలు వస్తాయని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జెండా ఎగురుతుందని అన్నారు పవన్ రెడ్డి