వైసీపీలో రంగంలోకి మరో వారసుడు – టీడీపీకి చుక్కలు

వైసీపీలో రంగంలోకి మరో వారసుడు - టీడీపీకి చుక్కలు

0
86

ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి వారసులు ఎంట్రీ ఇస్తారు.. ఆ సమయంలో తమ కుటుంబం గురించి చెప్పి ఆ పార్టీ గురించి చెప్పి ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు .. ఇక తండ్రికి పేరు ఉంటే కచ్చితంగా ఆ పేరు కొడుకుకి లాభిస్తుంది.. అలా వారసులు ఎన్నికల్లో గెలిచిన సందర్బాలు చాలా ఉన్నాయి.. అలాగే 50 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న వారు చాలా మంది ఉన్నారు.

ఇక తాజాగా వచ్చే ఎన్నికల సమయానికి ఎవరు వారసులు ఎన్నికల్లో పోటీ చేస్తారో ఇప్పుడు చెప్పలేని స్దితి …అయితే గత ఎన్నికల్లో చాలా మంది వారసులు టీడీపీలో ఓటమి పాలయ్యారు ..ఇప్పుడు మళ్లీ వచ్చే ఎన్నికల కోసం వారు వెయిట్ చేస్తున్నారు.. అప్పుడు నిలబడి తాము గెలిచి సాధించాలి అని చూస్తున్నారు.

ఏపీ సీఎం కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి ఇప్పుడు ఆయన రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యారు.. ఓ పక్క తిరుపతిలో టీడీపీ ఆశించిన స్దితిలో లేదు.. భూమన హవా నడుస్తోంది, ఈ సమయంలో అక్కడ ఆయన కుమారుడు కూడా ప్రతీ ఒక్కరితో కలిసి ముందుకు వెళుతున్నారు ..ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపుకి కుమారుడు ఎంతో సాయం చేశారు.. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడి రాజకీయం ఎంట్రీ పక్కా అని అంటున్నారు అక్కడ భూమన వర్గం, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఆయన అప్పట్లో ప్రకటించారు, సో కుమారుడు కూడా ప్రజల్లో ఉండటంతో ఆయనకు తిరుగు ఉండదు అంటున్నారు అభి అభిమానులు