వైసీపీ ఎమ్మెల్యేను తీవ్రవాదిని కొట్టినట్లు కొట్టారు

వైసీపీ ఎమ్మెల్యేను తీవ్రవాదిని కొట్టినట్లు కొట్టారు

0
77

టీడీపీ హయంలో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు… అధ్యక్షా చంద్రబాబు నాయుడు తనను మార్షల్స్ తాకారని అంటున్నారని, తోసేశారని అంటున్నారని ఆయన మండిపడ్డారు….

గతంలో తాను ఇదే శాసనసభలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని వస్తే పోలీసులు మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారని అన్నారు…. అంతేకాదు ఎన్నికల సమయంలో సర్వేపేరుతో వైసీపీ ఓట్లను తొలగిస్తున్నారని ధర్నాలు చేస్తే తనను పోలీసులు కారులలో తమిళనాడుకు తీసుకువెళ్లారని గుర్తు చేశారు…

తాను టీడీపీ ప్రభుత్వంలో పడరాని ఇబ్బందులు పడ్డానని అన్నారు… చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో ఎమ్మెల్యేగా గెలవడం తప్పా అని ప్రశ్నంచారు… అంతేకాదు తాను తిరుపతిలో ధర్నాలు చేస్తే కడప సెంట్రల్ జైల్లో వేశారని అన్నారు… తీవ్రవాదిని కొట్టినట్లు పోలీసులు తనను కొట్టారని చెవిరెడ్డి చెప్పకొచ్చారు…