16 చంద్రబాబుకు బస్తీమే సవాల్ అంటున్న లేడీ వైసీపీ ఎమ్మెల్యే

16 చంద్రబాబుకు బస్తీమే సవాల్ అంటున్న లేడీ వైసీపీ ఎమ్మెల్యే

0
81

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బస్తీమే సవాల్ విసిరారు… తాజాగా చిలకలూరు పేట ఎమ్మెల్యే విడుదల రజని మీడియాతో మాట్లాడుతూ గత కొద్దికాలంగా తనపై ఏదో ఒక రకంగా నిందలు మోపాలనే ఉద్దేశంతో కోటిని పోలీసులు కొడుతుంటే నేను వీడియో కాల్ చూశాననడం దారుణం అని అన్నారు..

ఒక వేల తాను వీడియో కాల్ చేసినట్లు చంద్రబాబు నాయుడు ప్రత్తిపాటి పుల్లారావులు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు… ఒక వేళ నిరూపించలేకపోతే చంద్రబాబు నాయుడు పుల్లారావులు రాజకీయ సన్యాసం తీసుకుంటారని రజని సవాల్ విసిరారు..

సోషల్ మీడియాలో కోటీ అనే వ్యక్తి తనపై దుష్ప్రచారం చేస్తుంటే తన కార్యకర్తలు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశారని స్పష్టం చేశారు..