వైసీపీ ఎంపీకి జగన్ సీరియస్ క్లాస్… డోంట్ రిపీట్

వైసీపీ ఎంపీకి జగన్ సీరియస్ క్లాస్... డోంట్ రిపీట్

0
93

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీకి చెందిన ఎంపీని సీరియస్ గా క్లాస్ తీసుకున్నారు… ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆంగ్ల విద్యాబోధనకు వ్యతిరేకంగా ఇటీవలే లోక్ సభలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయింది…

తాజాగా జగన్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు…ఈ సమావేశంలో ఎంపీ ప్రస్తావన రావడంతో ఆయనకు క్లాస్ తీసుకోమని ఉభయగోదావరి జిల్లా ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డికి జగన్ సూచించారు… ప్రభుత్వ బడుల్లో చదువుకునే వారందరూ పేద వర్గాలకు చెందిన పిల్లలేనని అన్నారు…

వారి జీవితాలు మారాలన్న ఆలోచనలతోనే ఇంగ్లీష్ మీడియం పెడుతున్నామని జగన్ అన్నారు… ఆంగ్లమాధ్యం వద్దంటున్న పత్రికలు పార్టీల ఆధిపతులు పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారని అన్నారు…. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పిల్లలు మాత్రమే ప్రభుత్వ బడుల్లో చదవుతున్నారని తెలిపారు…