వైసీపీ నేతల్లో సంబరాలు జగన్ కు మాత్రం టెన్షన్ టెన్షన్

వైసీపీ నేతల్లో సంబరాలు జగన్ కు మాత్రం టెన్షన్ టెన్షన్

0
79

తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణ లో రెండు స్థానాలు, ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ మొత్తం స్థానాలు అధికార పక్షాలకే దక్కనుండడం గమనార్హం. తెలంగాణ, ఏపీ లో అధికార పక్షం భారీ సంఖ్యబలం ఉడడంతో ఓటింగ్ జరిగినా… కూడా ఆయా అధికార పార్టీలే ఈ సీట్లు దక్కనున్నాయి. దీంతో ఆ పార్టీలో పెద్ద పండుగ వాతావరణం నెలకొంది. రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నా వారితో పాటు వారి అనుచరగణంలో సంబరాలు స్టార్ట్ అయ్యాయి.

తెలంగాణ కంటే ఏపీకి ఎక్కువు రాస్యభస్థానాలు దక్కనున్నాయి.. అవి అధికార పార్టీ ఖాతాలోనే పడనున్నాయి. దీంతో ఆ పార్టీలో పెద్ద పండుగ వాతావరణం నెలకొంది. వైసీపీ ఆశావాహులు సీఎం జగన్ ను ప్రసన్నం చేసుకునే పనిలో వున్నారు. అయితే ఇప్పటికే ఒకటి రెండు సీట్లను ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి.

అయితే అదే టైం లో ఓ వైపు మండలి రద్దు కావడం తో ఈ సీట్లపై ఆశలు పెట్టుకున్న వారి లిస్ట్ ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు వీరిలో ఎవరికి పదవులు ఇవ్వాలో అని జగన్ కు పెద్ద టెన్షన్ స్టార్ట్ అయ్యింది.