మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందా… ఆమె విషయంలో అధిష్టానం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… గతంలో ఉపాద్యాయురాలుగా ఉంటూ రాజకీయల్లోకి వచ్చింది గిడ్డి ఈశ్వరి… ప్రజా బలం వాక్చాతుర్వం ఉండటంతో 2014 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించారు..
ఆ తర్వాత ప్రతిపక్ష హోదాలో ఈశ్వరి పార్టీ తరపున దూకుడు కొనసాగించినప్పటికీ ఆ తర్వాత ఆమె అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు… ఇక 2019 ఎన్నికల్లో మరోసారి టీడీపీ తరపున అదే సెగ్మెంట్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు… వాస్తవానికి ఆమె వైసీపీలో ఉండి ఉంటే ఇప్పుడు జగన్ కేబినెట్ లో అవకాశం దక్కేది…
అయితే ప్రస్తుతం పాడేరులో గిడ్డి ఈశ్వరి ఇప్పుడు ఎటు కాకుండాపోయారని వార్తలు వస్తున్నాయి.. టీడీపీ కూడా ఆమెను పెద్దగా పట్టించుకోకుందట… దీంతో పాటు అక్కడి టీడీపీ క్యాడర్ ఆమెను వ్యతిరేకిస్తోందట… అటు ఆమె అనుచరులు కూడా వైసీపీలో చేరుతున్నారట… ఇటు క్యాడర్ అటు అనుచరులు ఇద్దరు ఆమెకు దూరం అవ్వడంతో ఇప్పుడు ఆమె ఒంటరి అయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు…