దేశంలో రాజ్యసభ ఎన్నికలకు రేసు మొదలైంది. మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో అన్నీ పార్టీల నుంచి రేసులో ఉన్న నాయకులు అధినేతలతో చర్చిస్తున్నారు, అయితే తాజాగా వైసీపీలో కూడా ఈ రేసు మొదలయింది.. అయితే సీఎం జగన్ మాత్రం పలు ఈక్వేషన్లు చూసుకుని నిర్ణయిస్తారు అని తెలుస్తోంది.
పెద్దల సభలకు ఎన్నిక కాబోయే ఆ నలుగురు ఎవరనే అంశంపై ఉత్కంఠ మరింతగా పెరిగింది. అయితే ఇప్పుడు వైసీపీ తరపుని ఇద్దరు రాజ్యసభకు వెళ్లారు.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయసాయిరెడ్డి ..మరోసారి ఎవరు వెళతారు అనే ఆలోచన అందరి మదిలో ఉంది… అయితే ఈరేసులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి మరి వారు ఎవరో చూద్దాం.
వైయస్ షర్మిల
మెగాస్టార్ చిరంజీవి
వైవీ సుబ్బారెడ్డి
అయోధ్య రామిరెడ్డి
వ్యాపార వేత్త నత్వానీ
బీద మస్తాన్ రావు
పిల్లి సుభాష్ చంద్రబోస్
మోపీదేవి వెంకటరమణ
అలీ
మోహన్ బాబు
ఇక్బాల్ మైనార్టీకోటాలో
పోసాని
మేకపాటి రాజమోహన్ రెడ్డి
మాజీ ఎంపీ రవీంద్రబాబు
మరి వీరిలో ఎవరికి అవకాశం వస్తుందో చూడాలి