టీడీపీ అభ్యర్దికి ఫోన్ వైసీపీ భారీ ఆఫర్

టీడీపీ అభ్యర్దికి ఫోన్ వైసీపీ భారీ ఆఫర్

0
111

తెలుగుదేశం నేతలపై కొందరు వైసీపీ కీలక నేతలు టార్గెట్ పెట్టారు.. ఎలాంటి రాజకీయ ఒత్తిడులు అయినా తీసుకువచ్చి పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులకు వల వేసి వైసీపీలో చేర్చుకోవాలి అని చూస్తున్నారు.. ఇందుకోసం వైసీపీ నుంచి కొందరు నాయకులు పెద్ద ఎత్తున రాత్రి సమయాల్లో ఫోన్లు చేస్తున్నారు.. అలాగే కొందరు నాయకులకు నేరుగా ఫోన్లు చేసి, పార్టీలోకి వస్తే సముచిత స్ధానం ఆర్దికంగా అండదండలు కాంట్రాక్టులు పదవులు ఇస్తాం అని చెబుతున్నారు.. రాని నాయకులకు కాస్త సమయం ఇస్తున్నాం ఆలోచించుకోండి అని చెబుతున్నారట.. ఇది ఎక్కడో కాదు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఎంపీ స్ధానంలో జరుగుతున్న రాజకీయ ని క్రీడ అంటున్నారు తెలుగుదేశం నేతలు.

టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఈ మధ్యన రకరకాల ఫోన్లు వచ్చి పడుతున్నాయి. మీరు తెలుగుదేశంలోనే ఉంటారా.. మా పార్టీలోకి రండి. బ్రహ్మాండమైన పవర్ ఇస్తాం. మీ హోదాకు తగ్గట్టుగా పదవులు ఇస్తాం. ఏదొకటి ఇప్పుడే చెప్పాలి..ఇలా అడుగుతున్నారు అని చెబుతున్నారు ఏలూరు ఎంపీ మాగంటి బాబు… కాని ఇలాంటి వారి మాటలు నమ్మకుండా నిజమైన తెలుగుదేశం అభిమానులు తమతోనే ఉన్నారు అని తెలియచేస్తున్నారు ఆయన.. ఈ సమయంలో వారికే కాదు నాకు ఫోన్లు వచ్చిన మాట నిజమే. ఏదేదో చెబుతారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కావాలనే టీడీపీ నేతలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు అని వారి ఫోన్ సెకన్లలోనే కట్ చేస్తాను అని తెలిపారు మాగంటి బాబు. ఎన్నికల వేళవైసీపీ రాజకీయం ఇలా ఉంది అని విమర్శిస్తున్నారు.