వైసీపీ సంచలన సవాల్… చంద్రబాబు స్వీకరిస్తారా

వైసీపీ సంచలన సవాల్... చంద్రబాబు స్వీకరిస్తారా

0
75

ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీలో పాలన చేప్పటి 100 రోజులు పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు చేసిన అభివ్రుద్ది కార్యక్రమాలు మీడియా ముందు వివరిస్తుంటే టీడీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను ఒక పుస్తకం ద్వారా విడుదుదల చేశారు. ఈ పుస్తకంలో టీడీపీ నాయకులు జగన్ వందరోజుల పరిపాలనలో వంద తప్పులు చేశారని మండిపడుతున్నారు. ఇక దీనిపై వైసీపీ ఉప ముఖ్యమంత్రులందరు ఒక భారీ ప్రకటణ చేస్తూ చంద్రబాబుకు పలు ప్రశ్నలు సవాల్ విసిరారు.

ఒక ఉద్యోగి ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన జీవోను పట్టుకుని బందరు పోర్టు తెలంగాణకు ఇచ్చేసే వ్యూహం అంటూ ప్రచారం చేయడం దిగజారుడుతనం కాదా

అమ్మ ఒడి స్కీం ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి రూ.15 వేలు ఇవ్వడం మీకు ఇష్టం లేదా? ఐదేళ్లలో బాబు ఏ తల్లికి అయినా రూపాయి ఇచ్చారా?

చంద్రబాబు తన అవినీతి బయటపడుతుందని రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని వ్యతిరేకించారు. పోలవరం డ్యాం భద్రత ప్రశ్నార్థకం అయ్యిందని చార్జిషీటులో రాశారు. సిమెంటు, ఇనుముతో చంద్రబాబు పునాదుల నుంచి సవ్యంగా కడితే దాని భద్రతకు ఎలాంటి ముప్పూ ఉండదు. మరి ఆ డబ్బు తినేసి బూడిదతో కట్టారా?

2014 జూన్‌ 8నే రుణమాఫీ చేసేశామని చంద్రబాబు చెప్పారు కదా? రుణ మాఫీ చేసి ఉంటే బకాయిల ప్రస్తావన ఎందుకొస్తుంది?

రూ.87,612 కోట్ల అప్పులను రూ.24,500 కోట్లకు కుదించి చివరకు అందులోనూ రూ.10 వేల కోట్లు ఎగ్గొట్టడం వాస్తవం కాదా?

అమరావతిలో రూ.50 వేల కోట్ల పనులు నిలిపివేశారన్నారే.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రూ.1500 కోట్లని చెప్పిన చంద్రబాబు మిగతా సొమ్ము ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు?

మీరు నిరుద్యోగ భృతి పేరుతో యువతను వంచించడం నిజం కాదా? వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఏకంగా 4.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుండటం నిజం కాదా?

అసెంబ్లీ సమావేశాలు పూర్తికాకుండానే అమెరికా పారిపోయిన చంద్రబాబు తనకు మైకు ఇవ్వలేదని ఎందుకు మాట్లాడుతున్నారు?

పింఛన్ల పెంపు, ఉద్యోగులకు ఐఆర్, విద్యార్థులకు వంద శాతం ఫీజు రియింబర్స్‌మెంట్, గ్రామ వలంటీర్లు, రైతులకు మేలు చేసే నిర్ణయాలు, పలు కంపెనీల ఏర్పాటును తప్పుపడుతున్నారంటే ఇవన్నీ మీకు ఇష్టం లేదనే కదా?

పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018కే గ్రావిటీపై నీళ్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తామన్న మాట ఏమైంది? టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుందని సాక్షాత్తు దేశ ప్రధాని చెప్పడం నిజం కాదా?