ప్రకాశంలో ముగ్గురిపై వైసీపీ టార్గెట్

ప్రకాశంలో ముగ్గురిపై వైసీపీ టార్గెట్

0
75

తెలుగుదేశం పార్టికి కాస్తో కూస్తో సీట్లు వచ్చింది ఏమైనా జిల్లా ఉంది అంటే అది కచ్చితంగా ప్రకాశం జిల్లా అని చెప్పాలి… ఈ జిల్లాలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బలపడాలని చూస్తున్న వైసీపీ, ఈ మేరకు గొట్టిపాటి ని వైసీపీ లో చేర్చుకోవడానికి పావులు కదుపుతున్నట్టు తెలిసింది… ఇక మరో ఇద్దరిపై కూడా టార్గెట్ పెట్టింది అని వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా జిల్లాలో వైసీపీ కీలక నేతలు అందరూ కూడా, వేరే పార్టీల నుంచి స్ధానిక సంస్ధల ఎన్నికల సమయానికి ఏ నేతలు అయినా చేరే ఉద్దేశం ఉంటే వారిని చేర్చుకోవాలి అని చూస్తున్నారు.. ఈ సమయంలో మెజార్టీ స్ధానాలు సాధించాలి అంటే గ్రౌండ్ లెవల్ నాయకులు సాయం అవసరం, అందుకే వారిని పార్టీలో చేర్చుకోవాలి అని చూస్తున్నారట.

వైసీపీలో చేరుతాము అంటే మరో ఇద్దరు ఎమ్మెల్యేలకి ఆహ్వనం ఇస్తాము అంటున్నారు.. అయితే వైసీపీ నేతలు వారికి వారు ఎవరిని కోరడం లేదట, పార్టీలోకి వచ్చే వారిని మాత్రం ఆహ్వనిస్తాం అంటున్నారు.