వైసీపీ టీడీపీలకు బిగ్ షాక్… బీజేపీ నయాప్లాన్….

వైసీపీ టీడీపీలకు బిగ్ షాక్... బీజేపీ నయాప్లాన్....

0
96

రాష్ట్ర రాజకీయాల్లో బలమైన శక్తిగా బీజేపీ ఎదగడానికి ప్రయత్నిస్తుందా 2024 ఎన్నికల్లో సర్కార్ కు ప్రధాన పోటీ ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తోందా అంటే అవుననే ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి…అందుకే జిల్లా స్థాయిలలో ఇప్పటికే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…

ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో ఈ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయట… జిల్లాలో బలమైన నాయకుడుగా ఉన్న టీజీ వెంకటేష్, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వంటి వారు జిల్లావ్యాప్తంగా బీజేపీ వాదనను బలంగా వినిపిస్తున్నారు… అంతేకాదు జిల్లా రాజకీయాలను దశాబ్దాలుగా శాసించిన ముఖ్యనాయకులు నేడు బీజేపీ తలపులు తడుతున్నారు…

అధికారంలో ఉన్న వైసీపీని రాజకీయంగా ఎదుర్కోవాలంటే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే సరైన వేధికగా కొందరు నాయకులు జిల్లాలో భావిస్తున్నారు… అందుకే జిల్లాకు చెందిన కొందరు టీడీపీ ఇంచార్జులు త్వరలో బీజేపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి…