వైసీపీ టీడీపీ నేతల మధ్య భగ్గుమన్న పాతకక్షలు….

వైసీపీ టీడీపీ నేతల మధ్య భగ్గుమన్న పాతకక్షలు....

0
106

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మరోసారి పాత కక్షలు భగ్గుమన్నాయి…. ఫొలం దారి విషయంలో టీడీపీ వర్గీయుల పై వైసీపీ వర్గీయులు దాడి చేశారు ఈ సంఘటన కర్నూల్ జిల్లా కౌతాళం మండలం తిప్పల దొడ్డి గ్రామంలో జరిగింది… టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు దాడి చేయడంతో ముగ్గురు టీడీపీ వర్గీయులకు తీవ్ర గాయాలు అయ్యాయి…

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… తిప్పల దొడ్డి పరిధిలో వైసీపీ వర్గీయుడు చూడి అయ్యప్పకు ఫొలం ఉంది దాని దిగువన టీడీపీకి చెందిన మల్లయ్య పొలం ఉంది అయ్యప్ప ఫొలం మీదుగా కొన్నాళ్ల నుంచి మల్లయ్య రాకపోకలు సాగిస్తున్నారు…

ఇక పై తను ఫొలం మీదుగా వెళ్లొద్దని కొన్ని రోజుల నుంచి అయ్యప్ప అడ్డుకున్నాడు కానీ ఎప్పట్లాగానే రాకపోకలు సాగిస్తుండటంతో మల్లయ్య అతని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు… దీంతో మాటా మాట పెరిగి ఇరు వర్గాలుకు ఘర్షణ జరిగింది… ఘర్షణలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు…