ముగ్గురు ఆశలు పెట్టుకున్నారు జగన్ ఎవరికి ఇస్తారో

ముగ్గురు ఆశలు పెట్టుకున్నారు జగన్ ఎవరికి ఇస్తారో

0
96

కర్నూలులో ఈసారి ముగ్గురునేతలు మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్నారట.. ఇంతకీ ఫలితాలు రాకుండా ఆశలు ఏమిటి అని అనుకుంటున్నారా, ఎలాగో వైసీపీ అధికారంలోకి రావడం పక్కా అని వార్తలు వస్తున్నాయి.. ఇక సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయి, ఇక కర్నూలు జిల్లాలో ఈసారి క్లీన్ స్వీప్ పక్కా అని చెబుతున్నారు.. అందుకే ఇక్కడ నుంచి ముగ్గురు జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు తమకు మంత్రి పదవి వస్తుంది అని ఆలోచన చేస్తున్నారు… డోన్ నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్న బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి. అలాగే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం నుంచి పోటీ చేసిన ఆయన కూడా మంత్రి పదవి వస్తుంది అని చూస్తున్నారు, ఇక ఎమ్మిగనూరు నుంచి పోటీ చేసిన చెన్నకేశవ రెడ్డి కూడా ఈసారి గెలిస్తే సీనియర్లుగా మంత్రి పదవి వస్తుంది అని భావిస్తున్నారు.

అయితే ఇందులో కాటసాని రాంభూపాల్ రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఆయనకు అవకాశం ఇవ్వచ్చు అంటున్నారు. ఇక డోన్ నుంచి బుగ్గనరాజేంధ్రనాథ్ రెడ్డి కూడా జగన్ కు అత్యంత నమ్మకమైన వ్యక్తి.. వీరిలో ఆయనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని చెబుతున్నారు.. మొత్తానికి వైసీపీ తరపున సీనియర్ నేతలు అందరూ ఆయనకే మంత్రి పదవి తథ్యం అని చెబుతున్నారు.