మరో వైసీపీ ఎంపీపై ఎల్లో మీడియా న్యూస్

మరో వైసీపీ ఎంపీపై ఎల్లో మీడియా న్యూస్

0
97

ఈ మధ్య వైసీపీ ఎంపీలు బీజేపీ నేతలతో ఆ పార్టీ నాయకులతో చాలా సయోధ్యగా ఉంటున్నారు.. దీంతో చాలా వరకూ వైసీపీ నుంచి బీజేపీలోకి ఎంపీల చేరికలు ఉంటాయా అని అందరూ చర్చించుకున్నారు.. అయితే సదరు వైసీపీ ఎంపీలు కూడా తాము ఏమీ పార్టీ మారడం లేదు అని చెప్పారు.. నరసాపురం ఎంపీ కనుమూరి రఘు రాజుగారు కూడా తెలియచేశారు.

తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కలిశారు. ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అయితే దీనిపై కూడా ఎల్లో మీడియాలు వార్తలు నెగిటవ్ గా ప్రచారం చేశాయి.. ఆయన కూడా పార్టీ మారుతున్నారు అని వార్తలు ఇచ్చాయి…అయితే పనుల మీద డవలప్ మెంట్ కార్యక్రమాల గురించి కలిసినా, పార్టీ మారిపోతున్నారు అని వార్తలు రాయడం పట్ల వైసీపీ విమర్శలు ఆరోపణలు చేస్తోంది.