జగన్ భార్య భారతీ పీఏ అంటూ, ఇతను ఏం చేస్తున్నాడో తెలిస్తే మతిపోతుంది

జగన్ భార్య భారతీ పీఏ అంటూ, ఇతను ఏం చేస్తున్నాడో తెలిస్తే మతిపోతుంది

0
106

రాజకీయ నేతల పీఏలు అంటూ కొందరు దుర్మార్గాలకు పాల్పడుతున్నారు.. మంత్రులు ఎమ్మెల్యేలకే కాదు ఏకంగా సీఎంలు వారి కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉపయోగించి, వారి పీఏలు అంటూ డబ్బులు దోచేస్తున్నారు కొందరు నకిలీ కేటుగాళ్లు, అంతేకాదు ఏకంగా ఏపీలో ఇలాంటి నయా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సతీమణి భారతి పీఏనని చెప్పుకుంటూ ఓ వ్యక్తి నయా మోసానికి తెరలేపాడు. కాని చివరకు తాను మోసపోయా అని పోలీసులకి ఫిర్యాదు చేశాడు బాధితుడు…విజయవాడ సమీపంలోని గొల్లపూడికి చెందిన కుమరేశ్వర అఖిలేష్ ఐసీఐసీఐ బ్యాంకులో కొన్నాళ్లు డిప్యూటీ మేనేజర్గా పనిచేసి మానేశాడు.ఈ సమయంలో అతనికి
జగదీష్ సత్యశ్రీరాం అనే వ్యక్తి కలిశాడు.

తాను ఉద్యోగాలు ఇప్పిస్తా అని నమ్మబలికాడు…వై.ఎస్.భారతి పీఏనని చెప్పుకుంటూ పంచాయతీరాజ్ శాఖలో ఎవరికైనా ఉద్యోగాలు కావాలంటే తనను సంప్రదించాలని కోరాడు. ఖాళీగా ఉన్న అఖిలేష్ ఇది నిజమేనని అనుకుని ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరాడు. తను 60 వేలు ముందు అడ్వాన్సుగా ఇచ్చాడు కాని ఉద్యోగాలు అందరికి రావడం అతనికి రాకపోవడంతో పోలీసులకి ఫిర్యాదు చేశాడు… అయితే సత్య శ్రీరాం ఇలా ఇద్దరు ముగ్గురిని ముంచేశాడని తేలింది దీంతో ఇప్పుడు జైల్లో ఉన్నాడు.