జగన్ గెలిస్తే చాలా మంది సెటిల్ అయిపోతాము అని భావిస్తున్నారా ? అవును తెలుగుదేశం పార్టీ కూడా ఇదే విమర్శ చేస్తోంది.. జగన్ తో ఇప్పటి వరకూ ఉన్న నేతలు మంత్రులు అవుతారు. చిన్న ఉద్యోగులు పెద్ద ఉద్యోగులు అవుతారు అని విమర్శలు చేస్తున్నారు. అయితే ఇలాంటి విమర్శలు షరామాములే అని వైసీపీ నేతలు కూడా పట్టించుకోవడం లేదు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అయిన లిస్ట్ చూసి వీరే మంత్రులు అంటూ కూడా చెప్పుకువచ్చారు.
అయితే, వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే తనకు పాలనాపరమైన సలహాల కోసం ఒక మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారిని నియమించుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది తెలుగుదేశం నేతలు కూడా అంటున్న మాట.. ఆయన జగన్ కు మరింత దగ్గర అవుతారు అని చెబుతున్నారు. ఇంతకీ ఎవరు అని అనుకుంటున్నారా, గతంలో ఏపీ సీఎస్గా పనిచేసిన అజయ్ కల్లామ్కు ప్రభుత్వ ముఖ్య సలహారు బాధ్యతలు అప్పగించేందుకు జగన్ నిర్ణయించినట్టు తెలుస్తుంది.. ఆయన ఏపీలో పలు శాఖల్లో పనిచేశారు.. అన్నింటిపై మంచి అవగాహన ఉన్న అధికారిగా ఆయన ఉన్నారు.. ఏపీ సీఎస్ గా చేసి మంచి పాలన అందించేలా నాయకులను ముందుకు తీసుకువెళ్లారు సలహాలు ఇస్తూ.. అందుకే ఆయనకు ఈ పదవి జగన్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారట.