ప్రస్తుతం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి… జగన్ ఒక వైపు అభివృద్ది దిశగా అడుగులు వేస్తుంటే ఆయన ఎమ్మెల్యేలు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటు రచ్చకెక్కుతున్నారు…
తాజాగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, కాకాని గోవర్దర్ రెడ్డికి విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి…. వీరిద్దరి మధ్య రెండు నెలల క్రితమే విభేదాలు తలెత్తాయి… తాజాగా శ్రీధర్ రెడ్డి ఎంపీడీవో సరళపై దాడి చేశారనే ఉద్దేశంతో ఆయనపై కేసు నమోదు అయింది…
వెంటనే శ్రీధర్ రెడ్డి బెయిల్ పై వచ్చి ఎంపీడీవో సరళను ఇక్కడకు తీసుకొచ్చింది కాకానే అని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు… ముఖ్యమంత్రి స్వేచ్చను కాకాని దుర్వినియోగం చేశారని అన్నారు… ఈ క్రమంలో వీరిద్దరిని జగన్ అమరావతికి పిలిపించుకుని క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.