YS Jagan: రేవంత్ రెడ్డిపై YS జగన్ తీవ్ర ఆరోపణలు 

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అంటూ ఏపీ సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. కడపలోని పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్ పేరును సమాధి చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని.. అలాంటి పార్టీలో చేరి వైఎస్సార్ వారసులమంటూ చెబుతున్నారని విమర్శించారు .

- Advertisement -

“వైఎస్సార్ మరణం తర్వాత నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు. నన్ను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ అభిమానులు ఏనాడో సమాధి కట్టారు. ఇప్పుడు ఆయన సమాధి వద్దకు వెళతారంట! ఆయన చనిపోయిన ఇన్నాళ్ల తర్వాత ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వస్తారట! నోటా ఓట్లు కూడా రాని కాంగ్రెస్ కు ఎవరైనా ఓటు వేస్తారా? రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ కు ఎవరైనా ఓటు వేస్తారా? కాంగ్రెస్ కు ఓటేస్తే మన కళ్లను మనం పొడుచుకున్నట్టే. కాంగ్రెస్ కు ఓటేయడం అంటే టీడీపీని గెలిపించడం కాదా?

వైఎస్సార్ వారసులంటూ వస్తున్న వారి కుట్రలను గమనిస్తున్నాం. వైఎస్సార్ చనిపోయాక ఆయనపై కుట్రలు చేసింది ఎవరు? మహానేత వైఎస్ఆర్ పేరు చార్జిషీట్ లో పెట్టింది ఎవరు? పైగా ఆయన పేరును మేమే చార్జిషీట్ లో పెట్టించామని మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ శత్రువులతో చేతులు కలిపిన మీరా ఆయన వారసులు? నాకంటే 13 ఏళ్ల చిన్నవాడు అవినాశ్… చిన్నపిల్లాడి జీవితాన్ని నాశనం చేయడానికి చంద్రబాబు తదితరులు కుట్రలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు కడపలో రాజకీయ శూన్యతను సృష్టించి, ఆ శూన్యంలోకి ప్రవేశించాలని చూస్తున్నారు. వీళ్లసలు మనుషులేనా? అవినాశ్ ఎలాంటివాడో మీకందరికీ తెలుసు, అవినాశ్ ఎలాంటివాడో నాకు తెలుసు. అవినాశ్ కు బ్రహ్మాండమైన మెజారిటీ అందించి గెలిపించాలని కోరుతున్నా.

రాజకీయాలు ఎంతగానో దిగజారిపోయాయి చంద్రబాబును గెలిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ కు ఓటేస్తే మన ఓట్లను చీల్చి ఎన్డీయేను గెలిపించినట్టే అవుతుంది. చంద్రబాబును గెలిపించేందుకే ఏపీలో కాంగ్రెస్ రంగప్రవేశం చేసింది. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. చంద్రబాబు పగలు బీజేపీతో కాపురం చేస్తారు, రాత్రి కాంగ్రెస్ పార్టీతో కాపురం చేస్తారు” అంటూ జగన్ విమర్శల వర్షం కురిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...