కమిట్మెంట్ తో అటునుంచి నరుక్కు వస్తారా…

కమిట్మెంట్ తో అటునుంచి నరుక్కు వస్తారా...

0
90

దేశంలో తానే సీనియర్ నాయకుడుని… తనకున్న రాజకీయ అనుభవం ప్రధానికి మోడీకి కూడా లేదు… నా రాజకీయ అనుభవం జగన్ మోహన్ రెడ్డి వయస్సు… వైఎస్ జగన్ కు ఏమాత్రం అనుభవం లేదు, ఆయన మంత్రిగా కూడా పనిచేయలేదు అంటూ నిత్యం మీడియా ముందు చంద్రబాబు నాయుడు అండ్ టీమ్ పాడిన పాటే పాడుతూ ఉంటారు.

నిజమే గతంలో టీడీపీ నాయకులు చెప్పిన మాటను రాష్ట్ర ప్రజలు నమ్మి చంద్రబాబుకు 2014 ఎన్నికల్లో అధికారాన్ని అప్పజొప్పారు. ఇక ఆ తర్వత జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసీపీకి అఖండ విజయన్ని అందించారు. ప్రస్తుతం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే జగన్ కు రాజకీయంగా పరిపూర్ణమైన అవగాహణ ఉందని ప్రజలు అంటున్నారు..

ప్రస్తుతం ఆయన కమిట్మెంట్ తో నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. పొద్దున లేస్తే అమరావతి కథలు చెప్పే చంద్రబాబు నాయుడు కంటే రాష్ట్ర పరిస్థితుల ద్రుష్ట జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే బాగున్నాయని అంటున్నారు.