జగన్ ఎఫెక్ట్ …ఈ జిల్లాలో టీడీపీ ఖాళీ

జగన్ ఎఫెక్ట్ ...ఈ జిల్లాలో టీడీపీ ఖాళీ

0
85

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావునాటినుంచి నేటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఇక్కడ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే మెజార్టీ స్థానాలు టీడీపీవే… ఇది ఒకప్పటి మాట… 2019 తర్వాత సీన్ రివర్స్ అయింది..

ఈ సారి మెజార్టీ స్ధానాలకంటే వైసీపీ ఎక్కువ స్థానాలను గెలుచుకుని కృష్ణా జిల్లాలో చరిత్రను తిరగరాసింది… ఇక టీడీపీ కూడా అధికారం కోల్పోవడంతో ప్రస్తుతం చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు తయారు అయ్యారు.. కొద్ది కాలంగా పార్టీ పటిష్టానికి తమ్ముళ్లు ఏమాత్రం కృషి చేయకున్నారట…

ప్రతిపక్షంలో చేరి వందరోజులు పూర్తి అయినా సరే టీడీపీ నాయకులు ఇంకా బయటికి రాకుండా ఉన్నారట..కొందరు మాత్రమే పార్టీ పాల్గొంటూ అప్పుడప్పుడు మీడియా ముందు కనిపిస్తున్నారు. ఇక మిగిలిన వారు ఇంతవరకు అడ్రస్ లేరని అంటున్నారు.