బెయిల్ రద్దు పిటిషన్ లో జగన్ కౌంటర్ దాఖలు : కీలక అంశాలు

0
101

వైసిపి అధినేత, ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై మంగళవారం సిబిఐ కోర్టులో విచారణ జరిగింది.  జగన్ తరుపు లాయర్లు ఇవాళ 98 పేజీల  కౌంటర్ ను దాఖలు చేశారు. జగన్ ఏరకంగానూ బెయిల్ షరతులు ఉల్లంఘించలేదని కౌంటర్ లో పేర్కొన్నారు. సిబిఐని ప్రభావంతం చేస్తున్నారన్న పిటిషనర్ వాదనలో నిజం లేదన్నారు. సిబిఐ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కాదని గుర్తు చేశారు.

అసలు పిటిషనర్ రఘురామ రాజుకు ఈ కేసులో సంబంధమే లేదని కౌంటర్ లో వివరించారు. ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని వివరిచారు. రఘురామ కృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని తెలిపారు. రఘురామను అనర్హుడిగా ప్రకటించాలని లోక్ సభ స్పీకర్ కు లేఖ కూడా రాశామని పేర్కొన్నారు. రఘురామరాజు పై ఎపిలో అనేక కేసులున్నాయని తెలిపారు. ఆయన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కోర్టును ఉపయోగించుకోవాలని చూస్తున్నారని జగన్ తరుపు లాయర్ పేర్కొన్నారు. విచారణను సిబిఐ కోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది.