ముగ్గురు మంత్రులని ఫిక్స్ చేసుకున్న జగన్

ముగ్గురు మంత్రులని ఫిక్స్ చేసుకున్న జగన్

0
102

ఏపీలో ఎన్నికల ఫలితాల కోసం రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి.. అయితే ఇక ఫలితాలు అధికారికంగా చెప్పాలి అంతే, ఏపీలో జగన్ సీఎం అయిపోయారు అని అంటున్నారు కొందరు.. ముఖ్యంగా జగన్ పాదయాత్ర తెలుగుదేశం పై వ్యతిరేకత ఇవన్నీ జగన్ కు పాజిటీవ్ అయ్యాయి అని చెబుతున్నారు .. అందుకే తెలుగుదేశం పార్టీ తరపున సీనియర్లు మంత్రులు కూడా ఇటీవల జగన్ అధికారంలోకి వస్తున్నారు అని తెలుసుకుని సైలెంట్ గా ఉన్నారు అని అంటున్నారు.. తాజాగా జగన్ కేబినెట్ ఏర్పాటుకు అలాగే తన ప్రమాణ స్వీకారం కోసం కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు అని వార్తలు వస్తున్నాయి.

అయితే ఇప్పటికే పాదయాత్ర అలాగే ఎన్నికల ప్రచారంలో కొందరికి తాను అధికారంలోకి వస్తే మంత్రి పదవులు ఇస్తాను అని చెప్పారు జగన్, ఇప్పడు ఇదే విషయాన్ని ఆయా నియోజకవర్గ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.. మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణా రెడ్ది, మర్రి రాజశేఖర్, బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవులు పక్కా అని, ఇప్పటికే జగన్ క్లారిటీ కూడా ఇచ్చేశారు. అయితే జగన్ చెప్పినట్టు వైసీపీ అధికారంలోకి వస్తే వీరు ముగ్గురు మంత్రి పదవిలో ఉంటారో లేదో చూద్దాం.. మరి జగన్ మాటమీద ఉంటారు కచ్చితంగా తొలి కేబినెట్లో వీరు ఉంటారు అని వైసీపీ నేతలు చెబుతున్నారు.