ప్రమాణస్వీకారం డేట్ ఫిక్స్ చేసుకున్న జగన్

ప్రమాణస్వీకారం డేట్ ఫిక్స్ చేసుకున్న జగన్

0
111

ఏపీ ఎన్నికల ఫలితాలపై జగన్ చాలా ధీమాగా ఉన్నారు.. తమకు కచ్చితమైన మెజార్టీ వస్తుంది అని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు..ఇక జగన్ తన ప్రమాణ స్వీకారానికి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారట. అవును ఇప్పుడు ఇదే విషయం పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది.. అంతేకాదు డేట్ కూడా వైరల్ అవుతోంది. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత దేవుడ్ని జగన్ మరింత నమ్ముతున్నారు. పూజలు యాగాలు, తిధులు నక్షత్రాలు అన్నీ నమ్ముతున్నారు ఇప్పుడు కూడా ఇలా డేట్ ని ప్రమాణస్వీకారానికి సెలక్ట్ చేసుకున్నారు అని అంటున్నారు.

మే 26 న జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారట. ఎందుకు ఈ డేట్ అంటే రీజన్ కూడా చెబుతున్నారు. వైఎస్ జగన్ 1972 డిసెంబర్ 21న కడప జిల్లాలో పుట్టారు. ఆయనది ఆరుద్ర నక్షత్రం..2019 మే 26వ తేదీన ధనిష్ట నక్షత్రం ఉంది. ఆరుద్ర నక్షత్రానికి ఇది పరమమైత్రి తార. ఆ రోజు ఆదివారం. సప్తమి. భాను సప్తమి. సూర్యుడు అన్ని తారలకు అధిపతి. ఇది చాలా దివ్యమైన ముహూర్తం అని పండితులు చెబుతున్నారట. ఇలాంటి ముహూర్తాలు ప్రమాణస్వీకారం, పట్టాభిషేకానికి మంచివని వారు వివరిస్తున్నారు. అందుకే జగన్ ఈ ముహూర్తాన్ని తిరుగు ఉండకూడదు అని ఫిక్స్ చేసుకున్నారట. ఇప్పుడు ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డేట్ కూడా వైరల్ అవుతోంది.