రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాలకుగాను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 12 జిల్లాల్లో సక్సెస్ అయ్యారని ఒక జిల్లాలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారని అంటున్నారు రాజకీయ మేధావులు… వైసీపీ ఆవిర్భవం నాటినుంచి జగన్ మోహన్ రెడ్డి ఈ జిల్లాలో నాయకత్వ విషయంలో సక్సెస్ కాలేకపోతున్నారని అంటున్నారు…
ఈ జిల్లాలో జగన్ ఇమేజ్ పార్టీ పట్ల అభిమానం ఉన్నప్పటికీ బలమైన నేతల కోరత ఉందని దాని ద్వారా పార్టీ దెబ్బతింటోందని అంటున్నారు… జిల్లాలో టీడీపీకి చెందిన బలమైన నాయకులు ఉన్నారు. వారు ఎప్పటినుంచో ఆయా నియోజకవర్గాలలో పాతుకుపోయారు
ప్రస్తుతం వారిని ఢీ కొట్టేందుకు నాయకులు కొరత వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు మేధావులు… అందుకే అన్ని జిల్లాల్లో వైసీపీ జెండా రెపరెపలాడినప్పటికీ విశాఖలో టీడీపీ జెండా కాస్త గాల్లో ఎగింరిందని అంటున్నారు.